నాన్న కొట్టారు: తనికెళ్ల భరణి..

TV9 Telugu

14 April 2024

నటుడిగా, స్క్రీన్ రైటర్ గా, కవిగా, నాటక రచయితగా దర్శకుడుగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నరు తనికెళ్ళ భరణి.

750 కంటే ఎక్కువ చిత్రాలలో నటుడిగా ఆకట్టుకున్నారు. వీటిలో కొన్ని తమిళం, హిందీ భాష సినిమాలు కూడా ఉన్నాయి.

తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.

శివపార్వతులను స్తుతిస్తూ అయన పడిన భక్తి పాటలు ఆల్బం నాలోన శివుడు గలడు బాగా ప్రసిద్ధి చెందింది. ఈ సాంగ్స్ ట్రెండ్ అయ్యాయి.

1986లో లేడీస్ టైలర్ మూవీతో మొదలుకొని ఎన్నో చిత్రాల్లో నటించిన ఈయన.. తాజాగా ఆయన చిన్నతన్ని తలుచుకున్నారు.

చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడినని అన్నారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి.

సరిగా చదువుకోకుండా గోల చేస్తుంటే, తండ్రి చెట్టుకు కట్టేసి కొట్టిన సందర్భాలున్నాయని గుర్తుచేసుకున్నారు.

తనకు ఇప్పటికీ డబ్బులు లెక్కపెట్టడం రాదని చెప్పారు తెలుగు చలనచిత్ర ప్రముఖ నటుడు, కవి,సింగర్ తనికెళ్ల భరణి.