15 November 2023
దటీజ్ సూర్య ! సింగిల్ వీడియోతో దళపతి విజయ్ రికార్డ్ బద్దలుకొట్టిన సూర్య.
ఇళయదళపతి విజయ్, వర్సటైల్ స్టార్ హీరో సూర్య! కోలీవుడ్ గడ్డపైనే కాదు.. టాలీవుడ్ ఫీల్డ్‌లోనూ... ఈ ఇద్దరూ స్టార్ హీరోలు..
తమ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్‌తోనైనా... సోషల్ మీడియాలో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకునే హీరోలు.
అలాంటి ఈ ఇద్దరి స్టార్ హీరోల మధ్య రీసెంట్‌గా.. ట్విట్టర్ ఎక్స్‌లో ఓ పెద్ద పోరు జరిగింది.
సుదా కొంగర డైరెక్షన్లో. సూర్య 43 వర్కింట్ టైటిల్‌తో.. తన నయా సినిమా అనౌన్స్ చేశారు సూర్య.
అయితే సూర్య షేర్ చేసిన ఈ అనౌన్స్ మెంట్ వీడియో.. ట్విట్టర్లో దాదాపు 2.65 కోట్ల వ్యూస్‌ను వచ్చేలా చేసుకుంది.
అయితే సోషల్ మీడియా ప్లాట్ ఫాం.. ట్విట్టర్ ఎక్స్ వేదికపై దేశంలోనే నమోదైన అత్యధిక వ్యూస్ ఫిగర్ ఇది.
ఇక గతంలో విజయ్.. తాను పోస్ట్ చేసిన ఓ వీడియోతో.. 2.62 క్రోర్ వ్యూస్ వచ్చేలా చేసుకున్నారు.
ఇప్పుడు సూర్య ఆ వ్యూస్ రికార్డ్‌ను క్రాస్ చేసి.. ట్విట్టర్ ఎక్స్‌లో నయా హిస్టరీ క్రియేట్ చేశాడు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి