టాలీవుడ్ Vs కోలీవుడ్..  2025 సమ్మర్‎కి సమరమే..

టాలీవుడ్ Vs కోలీవుడ్..  2025 సమ్మర్‎కి సమరమే..

image

12 November 2024

Battula Prudvi

సమ్మర్‌ను మీరే కాదు.. మేం కూడా క్యాష్ చేసుకుంటామంటూ మన స్టార్ హీరోలకు పోటీగా వచ్చేస్తున్నారు తమిళ హీరోలు.

సమ్మర్‌ను మీరే కాదు.. మేం కూడా క్యాష్ చేసుకుంటామంటూ మన స్టార్ హీరోలకు పోటీగా వచ్చేస్తున్నారు తమిళ హీరోలు.

ధనుష్ హీరోగా నటిస్తూ.. తెరకెక్కిస్తున్న ఇడ్లీ కడాయ్ సినిమా ఎప్రిల్ 10న రాబోతుంది. ప్రభాస్ పోటీలో ఉన్నా సై అంటున్నారు ఈ హీరో.

ధనుష్ హీరోగా నటిస్తూ.. తెరకెక్కిస్తున్న ఇడ్లీ కడాయ్ సినిమా ఎప్రిల్ 10న రాబోతుంది. ప్రభాస్ పోటీలో ఉన్నా సై అంటున్నారు ఈ హీరో.

మరోవైపు రజినీకాంత్ కూలీ సినిమా సైతం సమ్మర్‌లోనే విడుదల కానుంది. షూటింగ్ దానికి తగ్గట్లే ప్లాన్ చేస్తున్నారు లోకేష్ కనకరాజ్.

మరోవైపు రజినీకాంత్ కూలీ సినిమా సైతం సమ్మర్‌లోనే విడుదల కానుంది. షూటింగ్ దానికి తగ్గట్లే ప్లాన్ చేస్తున్నారు లోకేష్ కనకరాజ్.

రజినీకాంత్, ధనుష్ మాత్రమే కాదు.. అజిత్ చూపులు కూడా సమ్మర్ సీజన్‌పైనే ఉన్నాయి. ఈయన నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ పొంగల్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు.

అయితే దీనికంటే ముందే విడాముయార్చి సినిమా పూర్తి చేసారు అజిత్. దీన్ని సమ్మర్ బరిలో దించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ సినిమా సైతం సమ్మర్‌లోనే రానుంది. ఇది సూర్య 44వ చిత్రం. టైటిల్ ఇంకా ఫిక్స్ చెయ్యలేదు.

ఇటు హీరోగా.. అటు నిర్మాతగా రప్ఫాడిస్తున్న కమల్ హాసన్ థగ్ లైఫ్ అంటూ సమ్మర్ చివర్లో రానున్నారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది.

విక్రమ్, అమరన్‌తో నిర్మాతగా బ్లాక్‌బస్టర్స్ కొట్టిన కమల్.. ఇండియన్ 2తో నటుడిగా రేసులో కాస్త వెనకబడ్డారు. ఈ బాకీ థగ్ లైఫ్‌తో తీర్చేయాలని చూస్తున్నారు.