స్టార్‌ హీరో ధనుష్‌పై బ్యాన్‌..!

తమిళనాట స్టార్‌ హీరో ధనుష్‌కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతాకాదు

కోలీవుడ్‌లో అత్యధిక ఫాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న అగ్రనటుల్లో హీరో ధనుష్‌ ఒకరు

ఐతే ఈ స్టార్‌ హీరో సినిమాలపై కోలీవుడ్ చిత్ర నిర్మాతల మండలి నిషేదం విధించాలని చూస్తోంది

షూటింగ్‌కు సహరించని హీరోలకు రెడ్‌కార్డులు జారీ చేయాలని ఇప్పటికే చిత్ర నిర్మాతల మండలి హుకుం జారీచేసిన సంగతి విధితమే

హీరో ధనుష్‌ త్రేండల్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌ నిర్మాతల వద్ద అడ్వాన్స్‌ తీసుకుని డేట్స్‌ ఇవ్వడం లేదనేది ఫిర్యాదు

దీంతో త్రేండల్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌ సంస్థ తమిళ నిర్మాత మండలిని ఆశ్రయించింది

ఈ మేరకు ధనుష్‌ చిత్రాలపై నిషేధం విధించడానికి తమిళ చిత్ర నిర్మాతమండలి సిద్ధమైందని సమాచారం

దీంతో ఈ స్టార్‌ హీరోకు త్వరలో రెడ్‌కార్డు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో కోడై కూస్తోంది