01 June 2024

ప్రియుడు కాదు.. ఆ స్టార్ హీరోతో డేట్ డ్రీమ్ అంటున్న తమన్నా.. 

Rajitha Chanti

Pic credit - Instagram

అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది తమన్నా. కానీ ఇప్పుడు ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. 

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటివరకు ఏమాత్రం జోరు తగ్గలేదు. ఈ మధ్య వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది తమన్నా. 

తాజాగా తమిళంలో అరణ్మనై 4 చిత్రంలో నటించింది. ఖుష్భూ భర్త సుందర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లు వసూళ్లు రాబట్టింది. అరణ్మనై సినిమాలో తమన్నాతోపాటు రాశిఖన్నా కూడా ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న తమన్నా ఆసక్తిక కామెంట్స్ చేసింది. అరణ్మనై 4 సినిమాను ఎవరితో చూడాలని అనుకుంటున్నారు అని విలేకరి అడగ్గా..

తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి చూడాలని అనుకుంటున్నానని  సమాధానం చెబుతుంది అనుకున్నారు. కానీ అందుకు విభిన్నంగా ఆన్సర్ ఇచ్చి షాకిచ్చింది.

కానీ తమన్నా మాట్లాడుతూ.. తనకు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో డేట్ కు వెళ్లాలని ఉందని.. ఆయనతో కలిసి హర్రర్ సినిమా చూసే అవకాశం కావాలని తెలిపింది. 

షారుఖ్ ఖాన్ తో కలిసి హారర్ సినిమాను చూసే అవకాశం వస్తే తను చాలా హ్యాపీ అని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.