21 September 2025
3 నిమిషాల పాట కోసం రూ.6 కోట్లు.. స్పెషల్ పాటలతో హీరోయిన్ రచ్చ..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం సినీరంగంలో స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది హీరోయిన్ తమన్నా. గ్లామర్, ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టేస్తుంది.
ఇన్నాళ్లు టాప్ హీరోయిన్ గా సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది. ఆమె చేసిన సాంగ్స్ హిట్టయ్యాయి.
తాజాగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా తెరకెక్కించిన ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమాలోను నటించింది.
ఈ చిత్రంలో స్పెషల్ పాటతో ఆకట్టుకుంది. ఇందులో తమన్నా స్టెప్పులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. గ్లామర్ డోస్ పెంచేసింది ఈ బ్యూటీ.
అయితే ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో ఇప్పుడు టాక్ నడుస్తుంది.
కేవలం 3 నిమిషాల పాట కోసం ఏకంగా రూ.6 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరలవుతుంది.
గతంలో ఓదెల 2 సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. రైడ్ 2లోనూ నషా పాటతో అదరగొట్టింది తమన్నా.
అలాగే జైలర్ సినిమాలో తమన్నా స్పెషల్ పాట కోసం రూ.3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందట. ఇప్పుడు పాటకు 6 కోట్లు తీసుకుందట.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్