పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదంటున్న మిల్కీబ్యూటీ.. ఇట్టా మాట మార్చిందేంటీ..
Pic credit - Instagram
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ తమన్నా. ఇటీవలే భోళా శంకర్, జైలర్ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చింది ఈ బ్యూటీ.
సినీపరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టి ఇటీవలే 18 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా తన కెరీర్, లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది తమన్నా.
ప్రస్తుతం నటిగా తాను ఎంతో సంతృప్తికర జీవితాన్ని గడుపుతున్నట్లు తెలిపింది. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా తన లైఫ్ లో బెస్ట్ అని చెప్పుకొచ్చింది మిల్కీబ్యూటీ.
అయితే కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది మిల్కీబ్యూటీ. వీరిద్దరి ప్రేమ గురించి ఇప్పటికే బహిరంగంగా ఒప్పుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇప్పటికే తనకు పెళ్లి చేసుకునే ఉద్ధేశమే లేదని చెప్పేసింది.
వివాహ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. ఒక దశలో తాను కూడా వివాహం చేసుకోవాలని భావించినట్లు చెప్పుకొచ్చింది తమన్నా.
ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం తనకు లేదని.. నటన జీవితం ఇప్పుడు బాగా సాగుతోందని.. దానిపై మాత్రమే దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చింది తమన్నా.
వైవిధ్యభరిత కథలో నటించి అవకాశాలు వస్తున్నాయని.. అలాంటి పాత్రలకు వెంటనే ఒప్పుకున్నట్లు తెలిపింది. తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.