ఓ ఫ్యాన్ ట్వీట్‌కి ఫిదా అయిపోయిన తమన్నా

TV9 Telugu

07 March 2024

అప్పుడప్పుడూ నెటిజన్లు చేసే ట్వీట్లు.. ఆ ట్వీట్లలోని రాతలు.. సెలబ్రిటీలను ఫిదా చేస్తుంటాయి. వారిని ఉబ్బితబ్బిబయ్యేలా చేస్తుంటాయి.

ఇక తాజాగా తమన్నా విషయంలోనూ అదే జరిగింది. ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్ తమన్నాకు విపరీతంగా నచ్చింది.

దీంతో నేరుగా తమన్నానే ఆ ఫ్యాన్స్‌ ట్వీట్కు క్రేజీగా రిప్లై ఇచ్చింది. తన ట్వీట్తో నెట్టింట వైలర్ అవుతోంది.

మోడల్‌ టూ హీరోయిన్‌గా మారి ఇప్పటి వరకు తన జెర్నీ కంటిన్యూ చేస్తున్న తమన్నా... తన ఫిల్మ్ జెర్నీలో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఇక ఈ విషయాన్ని చెబుతూ ఓ ఫ్యాన్... తమన్నా సినిమాల్లోని ఐకానిక్ క్యారెక్టర్ల ఫోటోలన్నింటిన కలిపి ఓ ఫోటోగా మార్చి నెట్టింట పోస్ట్ చేశాడు.

'ఇప్పటికీ 19 ఏళ్లు అయింది. స్టిల్ గోయింగ్ గుడ్ తమన్నా.. అటూ.. తమన్నాను ట్యాగ్‌ చేసి ట్వీట్ చేశాడు ఫ్యాన్.

అయితే ఈ ట్వీట్కు ఫిదా అయిన తమన్నా.. ఆ ప్యాన్‌కు రిప్లై ఇచ్చింది. థాంక్యూ అంటూ లవ్‌ ఎమోజీని షేర్ చేసింది.

అంతేకాదు మెనీ మోర్ టూ కమ్‌ అంటూ... తన అప్‌ కమింగ్ సినిమాల గురించి తను చేసే క్యారెక్టర్ల గురించి కూడా ఓ హింట్ ఇచ్చి వదిలింది.