ఆ ఆలయంలో తమన్నా ప్రత్యేక పూజలు.. పెళ్లి కోసమేనా?
TV9 Telugu
28 January 2024
ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజిబీజీగా ఉంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా
సినిమాల సంగతి పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ ప్రేమ, పెళ్లి విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తోంది
ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో మిల్కీ బ్యూటీ ప్రేమలో ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
త్వరలోనే విజయ్, తమన్నాలు పెళ్లి చేసుకోనున్నారంటూ సినిమా మీడియా సర్కిళ్లలో పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది.
తాజాగా ఈ వార్తలకు బలం చేకూరుస్తూ అస్సాం గౌహతిలోని కామాఖ్య ఆలయాన్నిసందర్శించి మిల్కీ బ్యూటీ తమన్నా
తల్లిదండ్రులతో కలిసి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ముఖమంతా కుంకుమతో ఎంతో ట్రెడిషినల్‌గా కనిపించింది.
ప్రస్తుతం తమన్నా కామాఖ్య ఆలయ సందర్శన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి
అయితే తమన్నా ఈ పూజలన్నీ కూడా పెళ్లి కోసమే చేస్తుందని, త్వరలోనే ఆ శుభవార్త కూడా వినిపించనుందని తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి..