మిల్కీ బ్యూటీ అప్పటిదాకా పెళ్లిచేసుకోరా?

TV9 Telugu

10 March 2024

భోళా శంకరుడిని తలచుకుని ఏ పని మొదలుపెట్టినా, సక్సెస్‌ అయి తీరుతుందన్నది మిల్కీబ్యూటీ తమన్నా భాటియా నమ్మకం.

ఇటీవల ఆమె వారణాసిలో మహాశివుడిని కూడా దర్శించుకున్నారు. ఇప్పుడు ఓదెల2లో శివశక్తిగా కనిపించనున్నారు ఈ బ్యూటీ.

చేతిలో డమరుకం, నెత్తిన చందనం, కుంకుమ, చేతిలో దండంతో సరికొత్తగా కనిపిస్తున్నారు స్టార్ హీరోయిన్ తమన్నా.

19 ఏళ్ల కెరీర్‌లో చూసిందంతా ఒక ఎత్తు. సిసలైన జర్నీ ఇక ముందే ఉందని ఆల్రెడీ హింట్‌ ఇస్తున్నారు తమన్నా.

2024లో కథానాయకి తమన్నా భాటియా పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియా వేదికగా గతేడాది ఫుల్లుగా వార్తలొచ్చాయి.

ఈ ఏడాది చేసుకుంటారో, లేదో కానీ, ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమా అయ్యేవరకు పెళ్లి ఊసు ఎత్తకూడదని అనుకున్నారట మిల్కీబ్యూటీ.

ఓదెల 2 చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. హిట్ ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.

దీంతో పాటు అరణ్మనై 4 అనే తమిళ సినిమాలో నటిస్తుంది. అలాగే వేదా, స్ట్రీ 2 అనే మరో రెండు హిందీ చిత్రాల్లో చేస్తుంది.