హీరోయిన్ తమన్నా ఈ ఏడాది ఇప్పటికే బాక్ 2తో భారీ హిట్ కొట్టేసింది. హార్రర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం రూ.100 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.
ఇక తమన్నా చేతిలో ప్రస్తుతం వేద, ఓదెల 2 చిత్రాలు ఉన్నాయి. ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే విజయ్ వర్మతో తన లవ్ లైఫ్‌ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది మిల్కీ బ్యూటీ.
ఇక సోషల్ మీడియాలో తాజాగా తమన్నా షేర్ చేసిన ఫొటోలు అదిరిపోయాయి. లెహంగాలో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది తమన్నా. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
ఆదివారం ముంబైలో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ నిర్వహించిన ‘మంగళ ఉత్సవ్’కు తమన్నా భాటియా హాజరయ్యారన్న విషయం తెలిసిందే.
చాలామంది తారలు ఈ వేడుకకు విచ్చేసినా తమన్నానే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ మిల్కీ బ్యూటీ బ్లాక్ అండ్ గోల్డ్ ట్రెండ్ లెహంగాను ధరించి, అందరి దృష్టిని ఆకర్షించింది.
‘టోరానీ’ రూపొందించిన ఆ డిజైనర్ లెహంగా ధర రూ. 3.85 లక్షలు మాత్రమే. తమన్నా ఈ ఈవెంట్‌లో తన ఓల్డ్ స్కూల్ లుక్ తో పాతకాలపు బాలీవుడ్ సినిమాలోని తారలా అందంగా కనిపించింది.
ఆమె వింటేజ్ లుక్ కు అందరూ ఫిదా అయ్యారు. అయితే తమన్నా షేర్ చేసిన లెహంగా ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.