తన 18 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించడమే కాదు.. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి అలరించింది తమన్నా.
2005లో మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తమన్నా.. ఇప్పటివరకు అన్ని భాషల్లోనూ కలిపి సుమారు 50కిపైగా సినిమాల్లో నటించింది.
ఇటీవల 'జీ కర్దా', 'లస్ట్ స్టోరీస్ 2' అనే రెండు వెబ్ సిరీస్‌లలో నటించి.. ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అయింది తమన్నా భాటియా
ఈ రెండు సిరీస్‌లలో మోతాదుకు మించిన హాట్, శృంగార సన్నివేశాల్లో నటించింది తమన్నా. హద్దులు దాటి మరీ.. ఆమె చేసిన నటనకు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి.
రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన 'జైలర్'లో తమన్నా ఓ కీలక రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ కావడంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది మిల్కీ బ్యూటీ.
చిరంజీవితో నటించిన 'భోళా శంకర్' మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలి.. తమన్నాకు నిరాశ మిగిలించింది.
గత కొన్నేళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో మిల్కీ బ్యూటీ తమన్నా లవ్ ట్రాక్ నడిపిస్తోంది. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు.