గ్లామర్‌తో పాటు రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లంటే?

TV9 Telugu

22 May 2024

గతేడాది రిలీజైన జైలర్‌ చిత్రంలోని నువ్వు కావాలయ్యా అనే పాట యువతను ఉర్రూతలూగించింది. ఈ పాటకు అతి పెద్ద ప్లస్ పాయింట్ తమన్నా.

ఇందులో మిల్కీ బ్యూటీ అందంతో పాటు ఆమె హుషారైన స్టెప్పులకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

 ఇదిలా ఉంటే జైలర్ సాంగ్ తో వచ్చిన క్రేజ్‌ను తమన్న  పారితోషికం రూపంలో బాగానే వాడుకున్నారని  ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

జైలర్‌ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నా ఏకంగా రూ.3 కోట్లు పారితోషికం అందుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

క లేటెస్ట్ గా తమన్నా తమిళంలో నటించిన చిత్రం అరణ్మణై 4. నటి రాశీఖన్నా మరో నాయకిగా నటించింది. తెలుగులో బాకుగా రిలీజైంది.

ఇందులోనూ ఒక ప్రమోషనల్ సాంగ్ లో బాగానే అందాలు ఆరబోసింది తమన్నా. అలాగే అభినయం పరంగానూ ఆకట్టుకుంది.

కాగా అరణ్మణై 4 చిత్రానికి తమన్నా ఏకంగా రూ. 4 నుంచి రూ.5 కోట్ల మధ్యలో పుచ్చుకున్నట్లు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి తమన్నా గ్లామర్‌ తో పాటు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.