వదల బొమ్మాళీ అంటున్న తమన్నా!

TV9 Telugu

08 March 2024

కెరీర్‌ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది అనే మాటను వినీ వినీ బోర్‌ కొట్టిందా? అయినా సరే, మరోసారి అనడానికి నాకేం అభ్యంతరం లేదంటుంది తమన్నా.

ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 19 ఏళ్లయింది. ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోలతో నటించింది ఈ బ్యూటీ.

టైమ్‌ అలా గడిచిపోయిందని అనుకోకండి... పిక్చర్‌ అభీ బాకీ హై అని అంటుంది టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

నాట్‌ ఒన్లీ ఇన్‌ సిల్వర్‌ స్క్రీన్‌.. ఓటీటీల్లో కూడా నా తడాఖా చూపిస్తానని అంటుంది హీరోయిన్ తమన్నా భాటియా.

ఇప్పుడు ఆమె నీరజ్‌ పాండే డైరక్షన్‌లో ఓ సినిమా చేస్తుంది. ఫక్తు లేడీ ఓరియంటెడ్‌ మూవీ అని తెలిపింది మిల్కీ బ్యూటీ.

లాస్ట్ ఇయర్‌ హిందీ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్‌ సీజన్ 2 తో ఓటీటీలో చెలరేగిపోయింది వయ్యారి భామ తమన్నా.

ఇప్పుడు నీరజ్‌ పాండే డైరక్షన్‌లో ఓటీటీ సినిమాలో ఎలా కనిపిస్తారో చూడాలన్న ఆత్రుతతో ఉన్నారు మూవీ లవర్స్.