తమన్నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఫిట్నెస్ ట్రైనర్ చెప్పిన రహస్యం ఇదే..
Rajitha Chanti
Pic credit - Instagram
తమన్నా భాటియా.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించింది. కానీ ఈ అమ్మడు ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ పై ఫోకస్ పెట్టింది.
ఇన్నాళ్లు తెలుగులో టాప్ హీరోయిన్గా సత్తా చాటిన ఈ అమ్మడు ఇప్పుడు హిందీలో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈ బ్యూటీ వయసు 35 సంవత్సరాలు.
అయితే అందం, ఫిట్నెస్ విషయంలో అభిమానులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఆమె ఫిట్నెస్ రహస్యాన్ని రివీల్ చేశారు ఆమె జిమ్ కోచ్.
ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ.. శరీరంలో శక్తిని కాపాడుకోవడానికి ఓట్స్ తినాలని సూచించారు. గుడ్లలో ప్రోటీన్ ఉంటుందని, విటమిన్ బి ఉంటుందని అన్నారు.
శరీరంలో శక్తిని కాపాడుకోవడానికి పెరుగును ఆహారంలో చేర్చుకోవాలని అన్నారు. ఈ విషయంలో నిత్యం బ్లూబెర్రీ తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.
కొన్నిసార్లు చాక్లెట్ తినడం కూడా శరీరానికి మేలు చేస్తుందని సిద్ధార్థ్ చెప్పారు. అలాగే తమన్నా రోజు క్రమం తప్పకుండా వర్కవుట్స్, యోగా చేస్తుందట.
అలాగే కఠినమైన వర్కవుట్స్ చేసేందుకు తమన్నా ఆసక్తి చూపిస్తుంది. ప్రస్తుతం తమన్నా హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ సినీప్రియులను ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా ఈమధ్య కాలంలో ఎక్కువగా స్పెషల్ పాటలతో ఊర్రూతలూగిస్తుంది. 3 నిమిషాల పాట కోసం ఆమె రూ.6 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట.