దిమ్మతిరిగేలా చేస్తున్న తమన్నా ఆస్తుల విలువ
22 December 2023
TV9 Telugu
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు.
అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా తనకంటూ ఓ గుర
్తింపు ఏర్పర్చుకుంది.
2005లో శ్రీ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అదే ఏడాది చాంద్ సా రోషన్
చెహ్రా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
2023లో ఆమె ఆస్తుల విలువ 16 మిలియన్ డాలర్స్. అంటే దాదాపు 132 కోట్లు. 33 ఏళ్ల ఈ బ్యూటీ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్.
ఇక తమన్నా సంవత్సరానికి సుమారుగా 12 కోట్లు సంపాదిస్తుంది. సినిమాలతోపాటు.. బిజినెస్.. ప్రకటనల్లో నటిస్తూ భారీగా సంపాదిస్తుంది.
ఒక్కో ప్రాజెక్ట్ కోసం తమన్నా దాదాపు 4 నుంచి 5 కోట్లు తీసుకుంటుందట. ఒక్క స్పెషల్ సాంగ్ కోసం 60 లక్షలు తీసుకుంటుందట.
అంతేకాదు 2018లో ఐపిఎల్ ప్రారంభ వేడుకలో 10 నిమిషాల పాట కోసం 50 లక్షలు తీసుకుందట.
ఇక్కడ క్లిక్ చేయండి