ప్రాణం వచ్చిన పాలరాతి శిల్పం  ఈమెలా మారిందేమో..

06 November 2023

21 డిసెంబర్ 1989న మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సింధీ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల భామ తమన్నా భాటియా.

ఈ వయ్యారి తండ్రి పేరు సంతోష్, తల్లి పేరు రజనీ భాటియా. ఆమెకు ఆనంద్ భాటియా అనే ఓ సోదరుడు కూడా ఉన్నాడు.

పాఠశాల విద్య కోసం మహారాష్ట్రలో ముంబైలోని మానెక్‌జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్‌లో చేరింది ఈ వయ్యారి భామ.

13 సంవత్సరాల వయస్సులోనే నటన నేర్చుకోవడం కోసం ఒక సంవత్సరం పాటు పృథ్వీ థియేటర్‌లో స్టేజ్ ప్రదర్శనలలో పాల్గొంది.

చలనచిత్ర పరిశ్రమలో ప్రారంభ అనుభవం తర్వాత న్యూమరాలజీ ప్రకారం తన స్క్రీన్ పేరును "తమన్నా" మార్చుకుంది.

మంచి మనోజ్ సరసన హీరోయిన్ గా శ్రీ అనే ఓ తెలుగు సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది ఈ అందాల ముద్దుగుమ్మ.

2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రంతో తొలిసారి బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ మిల్కీ బ్యూటీ.

తర్వాత ఎన్నో తెలుగు చిత్రాల్లో చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దదాపు అందురు స్టార్ హీరోలతో నటించింది.