TV9 Telugu
అప్పుడలా.. ఇప్పుడిలా.. మునుపెన్నడూ చూడని లుక్ లో తమన్నా.
18 April 2024
టాలీవుడ్ లో ఒకప్పుడు తన సత్తా చాటి స్టార్ హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి రాణించింది తమన్నా.
ఈ మధ్య బోల్డ్ రోల్స్ ఎంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూన్న మిల్కి బ్యూటీకి తెలుగులో అవకాశాలు తగ్గాయి..
తాజాగా హారర్ మూవీస్ చేస్తున్న తమన్నా.. టాలీవుడ్ లో క్రైమ్ డ్రామాలో ఓదెల 2 లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం తమన్నా ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉంది. లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ తో ఓటీటీ ప్రియులను అలరించింది.
ఇక ఇప్పడు దర్శకుడు నీరజ్ పాండే తెరకెక్కిస్తున్న కొత్త సీరీస్‌లో తమన్నా రెండు కీలక పాత్రలలో నటించనున్నారు.
ముంబైలో జరిగిన ఓ క్రైమ్ కేసు నేపథ్యంలో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ పాండే.
తమన్నా ఇంతకు మునుపు ఎప్పుడూ చేయని పాత్రలో కనిపించనున్నారట..ఈ స్టోరీ కూడా కొత్తగా ఉండబోతుంది అన్నారు.
దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది అనడంతో ఆమె అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదే టాపిక్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి