హాలీవుడ్ లోకి అడుగు పెట్టనున్న టబు.. ఆ క్రేజీ మూవీలో ఛాన్స్
Rajeev
15 May 2024
సీనియర్ బ్యూటీ టబు తెలుగులో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.
తెలుగులో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన కులీనెంబర్ వన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
టబు అసలు పేరు పేరు తబుస్సుమ్ హష్మి.. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత టబు గా మార్చుకుంది ఈ బ్యూటీ
తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్ సరసన నటించి మెప్పించింది టబు
ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి అక్కడ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది.
ఇటీవల 'ది క్రూ' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించింది టబు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది.
తాజాగా టబు ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో కూడా ఛాన్స్ కొట్టేసింది. 'డ్యూన్: ప్రాఫెసీ' హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో టబుకి ఛాన్స్ వచ్చింది
ఇక్కడ క్లిక్ చేయండి