సోషల్ మీడియాలో సైలెంట్ అయినా తాప్సీ.. అదే కారణమా..

15 September 2023

ఎప్పుడూ సినిమా అప్‌డేట్స్‌తోనో... వివాదాలతోనో వార్తల్లోనే ఉండేవారు హాట్ బ్యూటీ తాప్సీ పన్ను. కానీ కొద్ది రోజులుగా ఈ బ్యూటీ కనిపించటమే మానేశారు.

సోషల్ మీడియాలో అడపాదడపా పోస్టులు పెడుతున్నా... హాట్ టాపిక్ అయ్యే రేంజ్‌లో తాప్సీ ప్రజెన్సే కనిపించటం లేదు.

సౌత్ నుంచి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వాళ్లలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు తాప్సీ పన్ను. తెలుగు సినిమాల్లో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన తాప్సీ.

నార్త్‌లో మాత్రం పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లో దూసుకుపోతున్నారు. నటిగానే కాదు నిర్మాతగానూ నార్త్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

సినిమాలతో  ఎంత బిజీగా ఉన్నా... సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు టచ్‌లోనే ఉంటారు తాప్సీ  పన్ను.

సోషల్ ఇష్యూ మీద స్పందించటం, తన మీద వచ్చే విమర్శలకు సమాధానం చెప్పటం లాంటివి సోషల్ మీడియా ద్వారానే చేస్తుంటారు. కానీ కొద్ది రోజులుగా ఈ బ్యూటీ ఆన్‌లైన్‌కు దూరమయ్యారు.

అయితే రీసెంట్ టైమ్స్‌లో ఈ బ్యూటీని బాగా మిస్ అవుతున్నారు ఆడియన్స్‌. ప్రజెంట్ షారూఖ్‌ హీరోగా తెరకెక్కుతున్న డంకీ సినిమాలో నటిస్తున్న తాప్సీ, ఆ సినిమా మీద చాలా సీరియస్‌గా ఫోకస్‌ చేశారు.

ఫస్ట్ టైమ్ తన డ్రీమ్ హీరోతో నటించే ఛాన్స్ రావటంతో ఏ డీవియేషన్‌ లేకుండా ఆ సినిమా మీదే దృష్టి పెట్టారు.  రీజన్‌ ఏదైనా... తాప్సీ యాక్టివ్‌గా లేకపోవటం విషయంలో ఫ్యాన్స్ మాత్రం బాగా హర్ట్ అవుతున్నారు.