'జపాన్' యాజ్ ఇట్ ఈజ్‌గా అలాంటి సినిమానే అవుతుంది: సూర్య..
01 నవంబర్ 2023
సముద్రంలో తిమింగలం లాంటి వ్యక్తి జపాన్. మరి అలాంటి వ్యక్తికి ఎదురైన సవాళ్లేంటి? వాటికి ఎలా దాటాడాన్నది అసలు కథ.
తన కెరీర్‌లో సింగం సినిమా ఎంత సక్సెస్ అయిందో, ఇప్పుడు కార్తికి జపాన్ కూడా అంతే పెద్ద సక్సెస్ కావాలని విష్ చేశారు సూర్య.
సింగం డేస్ గుర్తుకొస్తే కాసింత గర్వంగా ఉంటుందన్నారు. సింగంతో తాను సంపాదించుకున్న ఇమేజ్‌ని రోలెక్స్ కంప్లీట్‌గా మార్చేసిందని అన్నారు నడిప్పిన్ నాయగన్.
జపాన్ సినిమా తర్వాత కార్తి నటించబోయే ఖైదీ 2 గురించి కూడా ఇంట్రస్టింగ్ డీటైల్స్ రివీల్ చేశారు సూర్య.
ఖైదీ సీక్వెల్‌లో డిల్లీ త్వరలోనే ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడని అన్నారు. జనాల్లో ఢిల్లీకున్న క్రేజ్‌ని చూస్తుంటే తనకు హ్యాపీగా ఉంటుందన్నారు.
ఢిల్లీ ఎప్పుడైతే ప్రేక్షకులను పలకరిస్తాడో, ఆ వెంటనే వచ్చేయడానికి రోలెక్స్ కూడా రెడీ అవుతాడన్నది సూర్య స్టేట్‌మెంట్.
రోలెక్స్ తో తన కెరీర్ మొత్తం మారిపోయిందని, తాను స్క్రిప్ట్ లను సెలక్ట్ చేసుకునే తీరే చేంజ్ అయిందని అంటున్నారు సూర్య.
అంతలా ఇన్‌ఫ్లుయన్స్ చేసిన రోలెక్స్ కేరక్టర్‌తో చేసే సినిమా తన ఫ్యాన్స్ కి స్పెషల్ గిఫ్ట్ అంటున్నారు మిస్టర్ సూర్య.
ఇక్కడ క్లిక్ చెయ్యండి