కంగువ అన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందా

TV9 Telugu

19 March 2024

సూర్య గొంతు విని ఏమైంది అని ఫ్యాన్స్ అందరూ కంగారు పడతారనుకున్నారేమో... నా గొంతుకు ఏమీ కాలేదు అని క్లారిటీ ఇచ్చారు.

కంగువకు డబ్బింగ్‌ చెప్పీ చెప్పీ ఇలా తయారైందని ఓపెన్‌గా చెప్పేశారు హీరో సూర్య. ఆయన నటిస్తున్న సినిమా కంగువ.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి.

టీజర్‌ కట్‌ కూడా ఆల్రెడీ పూర్తయింది. టీజర్‌ చూసిన వాళ్లకు సినిమా మీద ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు మేకర్స్.

నెవర్‌ బిఫోర్‌ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు శివ ఈ సినిమాను డైరక్ట్ చేశారన్నది సూర్య టీమ్‌ నుంచి అందుతున్న సమాచారాం.

కాస్ట్యూమ్స్, మేకప్‌, హెయిర్‌... ఇలా ప్రతి విషయానికి బాగా టైమ్‌ స్పెండ్‌ చేసి, ఇష్టంగా చేశారట సూర్య.

ఆయన ఈ సినిమాను ప్రేమించిన తీరు చూసిన వారెవరైనా సరే వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవాల్సిందేనని అంటోంది టీమ్‌.