TV9 Telugu

సూర్య కంగువ సినిమా కలెక్షన్స్ పై భారీ అంచనాలు.

23 March 2024

తమిళ్ సూర్య గొంతుకి ఏమైంది అని అందరూ కంగారు పడతారనుకున్నారేమో నా గొంతుకు ఏమీ కాలేదు అంటూ క్లారిటీ ఇచ్చారాయన.

తను తాజాగా నటిస్తున్న సినిమా కంగువకు డబ్బింగ్‌ చెప్పీ చెప్పీ ఇలా తయారైందని ఓపెన్‌గా చెప్పేశారు హీరో సూర్య.

సూర్య నటిస్తున్న కంగువ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు జరుగుతున్న ఈ మూవీ తాజాగా టీజర్‌ కూడా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది.

టీజర్‌ చూసిన వాళ్లకు సినిమా మీద ఓ క్లారిటీ వచ్చింది అంటున్నారు కంగువ మేకర్స్. నెవర్‌ బిఫోర్‌ అన్నట్టు..

ఈ కంగువ సినిమాను తమిళ్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారనేది సూర్య టీమ్‌ నుంచి అందుతున్న సమాచారాం.

కాస్ట్యూమ్స్, మేకప్‌, హెయిర్‌ ఇలా ప్రతి విషయానికి బాగా టైమ్‌ స్పెండ్‌ చేసి, ఇష్టంగా చేశారట హీరో సూర్య.

ఆయన ఈ సినిమాను ప్రేమించిన తీరు వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవాల్సిందేనని అంటోంది టీమ్‌.