హీరో కాకముందు సూర్య ఏం చేశారో తెలుసా ??

హీరో సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్.

తమిళంలో గుర్తింపు ఉన్న నటుడు శివకుమార్ పెద్ద కొడుకు.

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తన పేరును సూర్య గా మార్చుకున్నాడు.

కేవలం నటుడిగానే కాకుండా.. సినీ నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు.

చెన్నైలోని పద్మా శేషాద్రి బాల భవన్ స్కూల్, సెయింట్ బెడేస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్య పూర్తిచేశారు.

చెన్నైలోని లయోలా కాలేజీలో బి.కామ్ డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

తన చదువు పూర్తయ్యాక గార్మెంట్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేశారు.

ఇక 1997లో సినీ ప్రయాణం మొదలుపెట్టారు. మొదటగా విజయ్ దళపతితో కలిసి నెరుక్కు నెర్ లో నటించారు.