తలైవా ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.. ఆ దర్శకుడితో నెక్ట్స్ మూవీ..!

11 September 2023

జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఆశ్వాదిస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇప్పుడు తలైవా ఫ్యాన్స్ కోసం మరో పండగలాంటి వార్త వచ్చేసింది.

తలైవా మరో మూవీకి సైన్ చేశారు. రజనీకాంత్ 171వ చిత్రానికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

రజినికాంత్ 171వ మూవీని కూడా జైలర్ మూవీని నిర్మించిన కళానిధి మారన్‌కు చెందిన సన్ పిక్చర్స్ నిర్మించనుంది.

తలైవా కొత్త మూవీని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంవహించనున్నాడు. గతంలో ఖైదీ, మాస్టర్, విక్రమ్ తదితర చిత్రాలను లోకేష్ కనగరాజ్ తెరకెక్కించాడు.

ప్రస్తుతం కనగరాజ్ తెరకెక్కిస్తున్న లియో మూవీ దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత రజనీకాంత్‌తో మూవీ కోసం కనగరాజ్ రెడీ అవుతున్నారు.

జైలర్ మూవీ కోసం పనిచేసిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.. తలైవా 171కి కూడా మ్యూజిక్ అందించనుండటం విశేషం.

జైలర్ హిట్ కావడంలో అనిరుధ్ మ్యూజిక్ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వారిద్దరి కాంబినేషన్‌లో మరో మూవీ రానుండటం తలైవా ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది.

రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ తలైవార్ 171 చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనుంది చిత్రబృందం.