10 November 2023

వెయ్యి కోట్ల హీరోస్ సినిమాలు అయితే నాకేంటి.. నేను సిద్దమే: మోహన్‌లాల్.

వెయ్యి కోట్ల వసూళ్లు సాధించే సత్తా ఉన్న ఇద్దరు టాప్ స్టార్స్ ఒక్క రోజు గ్యాప్‌లో థియేటర్లలోకి వస్తుండటంతో ఏ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోంది.?

షూటింగ్ మొదలైనప్పుడే రిలీజ్‌ డేట్‌ను లాక్ చేసింది డంకీ టీమ్‌. ఫస్ట్ టైమ్‌ కింగ్ ఖాన్ షారూఖ్‌ ఖాన్‌, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్‌ హిరానీ..

డంకీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ పఠాన్‌, జవాన్ సినిమాలతో వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసిన బాద్‌ షా, డంకీతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

వరుస వాయిదాల తరువాత డిసెంబర్‌ 22న సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు సలార్ మేకర్స్‌.

ఇంత భారీ పోటిలోకి సడన్ ఎంట్రీ ఇచ్చారు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్.

దృశ్యం సిరీస్‌లో తనకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నెరు సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

ఇంకా ప్రమోషన్‌ కూడా స్టార్ట్  చేయని ఈ సినిమాను రెండు భారీ చిత్రాలతో పాటు  రిలీజ్ చేయాలని నిర్ణయించటంతో ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ అవుతున్నారు.

నెరు మాలీవుడ్‌లో మాత్రమే రిలీజ్ చేసినా.. అక్కడ కూడా డంకీ, సలార్‌లా ప్రభావం ఉండే ఛాన్స్ ఉంటుందంటున్నారు విశ్లేషకులు.

మోహన్‌లాల్, జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. ఇందులో దృశ్యం, దృశ్యం 2 సూపర్‌ హిట్ కాగా, 12th Man దారుణంగా ఫెయిల్ అయ్యింది.