TV9 Telugu
28 February 2024
మహేష్ బాబు అంటే పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అంటున్నారు సూపర్ స్టార్.
ఏ ముహూర్తంలో పూరీ జగన్నాథ్ మహేష్ బాబుకు బిజినెస్ టైటిల్ పెట్టారో కానీ దాన్ని నిజం చేస్తున్నారు సూపర్ స్టార్.
సూపర్ స్టార్ చేస్తున్నది కూడా మామూలు బిజినెస్ కాదు.. దేశం మొత్తం మహేష్ బాబు బ్రాండ్ కనిపించాలంతే అంటున్నారు.
తాజాగా మరో బ్రాండ్ ఓపెన్ చేస్తున్నారీయన. మహేష్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నారో.. బిజినెస్‌లోనూ అంతే బిజీగా ఉన్నారు.
ముఖ్యంగా మల్టీప్లెక్స్ వైపు మహేష్ మనసు మళ్లుతుంది. ఇప్పటికే AMB సినిమాస్‌తో సూపర్ సక్సెస్ అయ్యారు మహేష్.
AMB సినిమాస్ ఉండగానే.. RTC క్రాస్ రోడ్స్‌లో ఏసియన్‌తోనే కలిసి AMB క్లాసిక్ ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబు.
RTC క్రాస్ రోడ్స్‌కు, మహేష్ బాబుకి మంచి విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్నో సినిమాలు అక్కడ సిల్వర్ జూబ్లీస్ ఆడాయి.
సుదర్శన్ 70 MM ఉన్న చోటే 7 స్క్రీన్లతో AMB క్లాసిక్ పేరుతో ఏషియన్ భాగస్వామ్యంలో మహేష్ మల్టీప్లెక్స్ రాబోతుందని తెలుస్తుంది.
RTC క్రాస్ రోడ్స్ అంటే ఇప్పటి వరకు సింగిల్ స్క్రీన్స్ అడ్డా.! అలాంటి చోట మల్టీప్లెక్స్ కడితే ప్రభావం ఎలా ఉంటుందో..?
హైదరాబాద్ మాత్రమే కాదు.. దేశమంతా మల్టీప్లెక్స్ బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు బిజినెస్ మాన్ మహేష్ బాబు .
ఇక్కడ క్లిక్ చెయ్యండి