TV9 Telugu

ఆ విషయంలో రాజమౌళి పైనే ఆశలు పెట్టుకున్న మహేష్ ఫ్యాన్స్..

25 December 2023

ప్రజెంట్ సౌత్ హీరోలంతా పాన్ ఇండియా రేంజ్‌లో సౌండ్ చేస్తున్నారు. ఈ విషయంలో సూపర్‌ స్టార్ మహేష్ బాబు మాత్రమే కాస్త వెనకబడ్డారు.

బాలీవుడ్ ఆడియన్స్‌ను మెప్పించే పర్ఫెక్ట్ లుక్స్ ఉన్న మహేష్ కాస్త కాన్సన్‌ట్రేట్ చేస్తే నార్త్‌లో సత్తా చాటడం పెద్ద విషయమే కాదు.

అందుకే నెక్ట్స్‌ మూవీతో అయినా ఆ టాస్క్ కంప్లీట్ చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. సౌత్ హీరోలంతా ఇప్పుడు పాన్‌ ఇండియా మార్కెట్‌ను శాసిస్తున్నారు.

కానీ ఈ లిస్ట్‌లో సూపర్‌ స్టార్ మహేష్ బాబు పేరు మాత్రం కనిపించటం లేదు.

రీజినల్‌ మార్కెట్‌లో టాప్ పోజిషన్‌లో ఉన్న మహేష్, నేషనల్ రేంజ్‌ మీద ఫోకస్ చేయట్లేదు.

కానీ ఇప్పుడు అంతకు మించి కావాలన్నది అభిమానుల కోరిక. గుంటూరు కారం తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సూపర్‌ స్టార్‌.

ఆల్రెడీ రాజమౌళి పాన్ ఇండియా దర్శకుడే కాబట్టి, మహేష్ మూవీ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది.

అయితే పాన్ ఇండియా మార్కెట్‌లోకి జస్ట్ ఎంట్రీ ఇవ్వటం కాదు, ప్రభాస్, అల్లు అర్జున్‌లా తన మార్క్‌ చూపించాలని ఎక్స్‌పెక్ట్  చేస్తున్నారు ఫ్యాన్స్‌.