సునీల్ ఫోకస్ అంతకోలీవుడ్ పైనేనా.. టాలీవుడ్ ను పట్టించుకోవడం లేదా..
16 September 2023
ఇండస్ట్రీలో సునీల్ కెరీర్ మొదలై దాదాపు పాతికేళ్ళు అవుతుంది. ఇన్ని సంవత్సరాలలో తెలుగు తప్ప ఇతర ఇండస్ట్రీ వైపు ఎప్పుడూ చూడలేదు ఈయన.. చూడాల్సిన అవసరం కూడా రాలేదు.
కమెడియన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న సునీల్ హీరోగా మారిన తర్వాత కాస్త డల్ అయ్యారు. ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నారు ఈయన..కాకపోతే తెలుగులో కాదు తమిళ ఇండస్ట్రీలో..!
సెకండ్ ఇన్నింగ్స్ లో అరవింద సమేత, పుష్ప, గాడ్ ఫాదర్ మినహాయిస్తే సునీల్ నుంచి చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ రాలేదు. పైగా కమెడియన్ గా చూసిన ఈయనను మన ఆడియన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒప్పుకోవడం లేదు.
దాంతో కోలీవుడ్ వైపు చూస్తున్నారు సునీల్. మొన్న శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన మహావీరుడు సినిమాతో తమిళ ఎంట్రీ ఇచ్చిన ఈయన.
జైలర్ లోను కీలక పాత్రలో నటించారు. అలాగే విశాల్ మార్క్ ఆంటోనీ, కార్తీ జపాన్ సినిమాలోనూ కీ రోల్ చేశారు సునీల్.
ఇప్పుడు సునీల్ చేతిలో తెలుగు కంటే తమిళ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. కార్తీ జపాన్ నవంబర్ లో విడుదల కానుంది. వీటితో పాటు బుల్లెట్, ఈగై అనే సినిమాల్లోనూ నటిస్తున్నారు సునీల్.
మరో రెండు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక తెలుగులో పుష్ప 2, గుంటూరు కారం, గేమ్ ఛేంజర్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఈయన తీరు చూస్తుంటే ఇక మీద కూడా తమిళ ఇండస్ట్రీ పైనే ఫోకస్ చేసేలా కనిపిస్తున్నారు. అక్కడే ఆయనకు చాలెంజింగ్ రూల్స్ వస్తున్నాయి.