ప్రభాస్ అక్కగా సుమ

తెలుగులో యాంకర్ అనే పేరు వినిపించగానే అందరికీ గుర్తొచ్చేది సుమ కనకాల.

తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ మనలో కలిసిపోయింది.

నటుడు రాజీవ్ కనకాలని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది.

కెరీర్ ప్రారంభంలో సినిమాలు, సీరియల్స్ లో నటించిన సుమ.

ఆ తర్వాత మాత్రం రూట్ మార్చి యాంకర్ గా సెటిలైపోయింది.

అసలు విషయానికొచ్చేస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. 'ఈశ్వర్'తో హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటికీ 'వర్షం'తో తొలి హిట్ అందుకున్నాడు.

ఈ సినిమాలోనే ప్రభాస్ కి అక్కగా సుమ నటించింది.

కాకపోతే అది ఆమె కెరీర్ ప్రారంభంలో కావడంతో ఎవరూ పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు.

 'రామబాణం' ప్రమోషన్స్ టైంలోనూ గోపీచంద్ ఇదే విషయమై సుమని ఆటపట్టించాడు.

బహుశా స‍్టోరీ చదువుతున్న మీలో చాలామందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు.