లెక్కల మాస్టర్ సుకుమార్‌కు ఓ సిగ్నేచర్ మార్క్ ఉంది.. అదే స్పెషల్ నంబర్. యస్, సుకుమార్ సినిమా అంటే స్పెషల్ సాంగ్ దుమ్ము లేవాల్సిందే.
ఇప్పటికే ప్రతీ సినిమాలో స్పెషల్ నెంబర్‌లో ఆకట్టుకున్న సుక్కు... పుష్ప 2 కోసం ఎవరినీ రంగంలోకి దించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.
రీసెంట్ టైమ్స్‌లో సినిమా మేకింగ్ స్టైల్ పూర్తిగా మార్చేసిన సుకుమార్ ఒక్క విషయంలో మాత్రం మారేదే లేదని తేల్చేశారు. అదే స్పెషల్ నెంబర్.
ఆర్య నుంచి ప్రతీ సినిమాలోనూ ఓ మాస్ మసాలా స్పెషల్ సాంగ్‌తో దుమ్ము రేపటం సుకుమార్ స్టైల్ అని తెలిసిన విషయమే.
అందుకే పూర్తిగా తన స్టైల్‌కు భిన్నంగా తెరకెక్కిన రంగస్థలంలోనూ తన మార్క్ స్పెషల్ సాంగ్‌ను మాత్రం కంటిన్యూ చేశారు.
అదే సెంటిమెంట్‌ను పుష్పలోనూ కంటిన్యూ చేశారు. హీరోయిన్ సమంతతో ఊ అంటావా మావా ఉఉ అంటావా అంటూ అదిరిపోయే సాంగ్‌తో పూనకాలు తెప్పించారు.
ఇప్పుడు అందరి దృష్టి పుష్ప 2 మీద పడింది. పుష్ప 2తో పాన్ ఇండియా మార్కెట్‌ను ఫోకస్ చేస్తున్న సుక్కు స్పెషల్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారు.
స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్లను తీసుకుంటే సినిమాకు మరింత హెల్ప్ అవుతుందన్న ఆలోచన కూడా చేస్తున్నారట లెక్కల మాస్టర్.