పుష్ప 2పై సుకుమార్ షాకింగ్ నిర్ణయం.. టెన్షన్‌లో బన్నీ ఫ్యాన్స్.

TV9 Telugu

01 June 2024

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప 2: ది రూల్’. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ క్రేజీ సీక్వెల్ రిలీజ్ కానుంది.

ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, గ్లింప్స్, టీజర్‌ ఈ మూవీపై మరింత ఆసక్తిని పెంచేలా చేశాయి.  

అయితే సినిమా విడుదల తేది దగ్గర పడినా.. ఇంకా పుష్ప 2 షూటింగ్‌ పూర్తికాకపోవడం బన్నీ అభిమానుల్ని టెన్షన్ పెడుతోంది.

 తలనొప్పి కొనసాగుతుండగానే పుష్ప 2 విషయంలో  డైరెక్టర్‌ సుకుమార్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా క్లైమాక్స్‌ని మార్చాలని సుకుమార్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం రీ షూట్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ రీషూట్‌కి వెళ్తే మాత్రం  ఆగస్ట్‌ 15కి అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్‌ కావడం కష్టమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పైగా ఇంకా నాలుగు పాటలను రిలీజ్‌ చేయాల్సి ఉంది. అలాగే ఒక స్పెషల్‌ సాంగ్‌ షూట్‌ కూడా పెండింగ్ లో ఉందని తెలుస్తోంది.

ఇలా ఎన్నో పనులు పెట్టుకుని క్లైమాక్స్ ఛేంజ్ పేరుతో రీషూట్ కు వెళ్లడంపై అల్లు అర్జున్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.