TV9 Telugu
24 February 2024
ఆహాలో మోగనున్న అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్.. డేట్ ఎప్పుడంటే.?
ఆహాలో మోగనున్న అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్.. డేట్ ఎప్పుడంటే.?
కలర్ ఫొటో సినిమాతో హీరోగా మంచి హిట్ కొట్టాడు సుహాస్. టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అలా ఈ మధ్యనే అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో మన ముందుకు వచ్చాడు సుహాస్. ఫిదా ఫేమ్ శరణ్యా కీలక పాత్ర పోషించింది.
ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సుహాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకునట్టు వెల్లడి.
తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై కీలక అప్ డేట్ ఇచ్చింది ఆహా సంస్థ. డేట్ అండ్ కాప్షన్ తో పోస్టర్ రిలీజ్ చేసింది.
‘మల్లిగాడు మాయా ప్రపంచంలోకి అడుగు పెట్టండి’ అంటూ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసింది.
అయితే ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం మార్చి 1 నుంచి ఓటీటీ ఆహా ప్లాట్ ఫామ్ లో అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ మోగనుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి