హోస్ట్‌గా మరిన సుధీర్..
TV9 Telugu
13 April 2024
తనదైన కామెడీతో అందరికీ నవ్వులు పంచే నటుడు సుడిగాలి సుధీర్. ప్రస్తుతం టాలీవుడ్ హీరోగా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం ఆయన ప్రముఖ షో సర్కార్4 హోస్ట్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. దీని మొదటి మూడు సీజన్లు ప్రదీప్ హోస్ట్ చేసారు.
ప్రముఖ డిజిటల్ ప్లేట్ ఫామ్ ఆహా వేదికగా త్వరలో ప్రసారం కానుంది సర్కార్ 4. తాజాగా ఈ షోకి సంబంధించి ఓ ప్రోమోను విడుదల చేసారు.
'ఆట మారింది ఆటగాడు మారాడు' అంటూ సర్కార్ 4 ప్రోమోలో మెప్పించారు తెలుగు హీరో, కమెడియన్ సుడిగాలి సుధీర్.
సర్కార్ సీజన్ 4 పోమోలో డబ్బు గురించి సుధీర్ చెప్పిన డైలాగులు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ త్వరలోనే ఆహా వేదికగా విడుదల చేయనున్నట్లు తెలిపారు ఈ సక్సెస్ ఫుల్ రియాలిటీ షో మేకర్స్.
సుధీర్ ప్రస్తుతం గోట్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ దివ్య భారతి కథానాయక.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్, టీజర్, పాట ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఈ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి