సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా హరోం హర నుంచి ఫస్ట్ సింగిల్‌ని విడుదల అయింది. సుధీర్‌బాబు కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది.
చిత్తూరు జిల్లాలో 1989లో జరిగిన కథగా చూపిస్తున్నారు. ఈ సినిమా కోసం కుప్పం యాస నేర్చుకున్నారు సుధీర్‌బాబు.
ధన్‌రాజ్ దర్శకత్వం వహిస్తూ..నటిస్తున్న సినిమా రామమ్ రాఘవం. సముద్రఖని ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నారు.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హీరో రామ్ పోతినేని ఈ సినిమా గ్లింప్స్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.
మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ధన్‌రాజ్ రామమ్ రాఘవం సినిమా చేసినట్టు చెప్పారు రామ్ పోతినేని.
రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ సినిమా డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ మారింది.
ఛార్మి నిర్మాతగా వ్యహరిస్తున్న ఈ సినిమాను ముందు మార్చ్ 8న విడుదల చేయాలనుకున్నా.. షూటింగ్ ఆలస్యమైంది.
దాంతో క్వాలిటీ ఔట్ పుట్ కోసం మరింత టైమ్ తీసుకుంటున్నారు మేకర్స్. జూన్ 14న డబుల్ ఇస్మార్ట్‌ను విడుదల కానున్నట్లు తెలిపారు.