సూర్య 43పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన సుధా కొంగర..

29 October 2023

కాటుక కనులే... అంటూ మీరు కూడా హమ్‌ చేసుకుంటున్నారా? మరి ఆకాశం నీ హద్దురా సినిమా , అందులోనూ ఆ పాట ఇంపాక్ట్ అలాంటిది.

అందుకే సుధా అండ్‌ సూర్య కాంబో మరోసారి చూడాలని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రేజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లే మూవీతో ఆడియన్స్‌ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ స్టార్స్‌.

మాధవన్‌ అండ్‌ వెంకటేష్‌తో తెరకెక్కించిన గురు, సూర్యతో ఆకాశం నీ హద్దురా... కమర్షియల్‌ హీరోలను మాస్‌ కి దగ్గర చేయగలరన్న ఇమేజ్‌ తెచ్చిపెట్టాయి సుధా కొంగరకి.

నార్త్ లో అక్షయ్‌లాంటి హీరో సుధ డైరక్షన్‌లో సూరరైపోట్రు రీమేక్‌ని యాక్సెప్ట్ చేయడానికి రీజన్‌ కూడా అదే.

ప్రజెంట్ అక్షయ్‌తో చేస్తున్న మూవీ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేసింది. దీంతో నెక్ట్స్ సినిమా మీద కాన్సన్‌ట్రేట్ చేశారు సుధా కొంగర.

హృతిక్ హీరోగా హోంబలే బ్యానర్‌లో సుధా కొంగర మూవీ అన్న ప్రచారం జరిగింది. తాజాగా తన నెక్ట్స్ మూవీ గురించి అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు సుధా.

నెక్ట్స్ మూవీ సూర్య 43 అంటూ సుధా చాలా రోజుల కిందటే ట్వీట్ చేశారు. దీంతో అది మరో బయోపిక్‌ అన్న ప్రచారం మొదలైంది.

తాజాగా సూర్యతో తాను చేయబోయే నెక్ట్స్ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మాత్రమే తెరకెక్కిస్తున్నామని, బయోపిక్‌ కాదని క్లారిటీ ఇచ్చారు.