సలార్ చిత్రం వాయిదా పడనుందా.. ఈ కారణాలు తెలిస్తే అవుననాల్సిందే..
03 September 2023
ఈ వారంలో సలార్ ట్రైలర్ స్క్రీన్స్ మీద సందడి చేస్తుందనుకుంటే, ఆశల మీద నీళ్లు జల్లే వార్త వైరల్ అవుతోంది. సలార్ చెప్పిన టైమ్‌కి రాదన్న మాట ఎప్పటి నుంచో ఉంది.
అయితే, అబ్బే అలాంటిదేమీ లేదు. మేం వచ్చి తీరుతామని అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే వాయిదా పడితీరుతుందన్న పాత మాట ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. అది కూడా స్ట్రాంగ్ రీజన్స్ తో.
సలార్ మూవీ యుఎస్ ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే ఇప్పుడు టిక్కెట్లను కేన్సిల్ చేసి, డబ్బులు రీఫండ్ చేస్తున్నారనే మాట తెగ వైరల్ అవుతోంది.
అందుకు రీజన్.. ఇంకా 40 రోజుల సలార్ గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్‌లో ఉందట. అది చూసి ప్రశాంత్ నీల్ కన్విన్స్ కావాలి.
ఓ ఐడియాకు వస్తేనే, ఫర్‌దర్‌గా ట్రైలర్ కట్ చేయడానికి, ఇంకే ప్రమోషన్లనైనా ప్లాన్ చేయడానికి.ఒకవేళ ప్రశాంత్ నీల్ ప్రాడెక్ట్ తో కన్విన్స్ కాకపోతే, రీషూట్ చేస్తారనే టాక్ కూడా ఉంది.
మంచి వీకెండ్‌ని మిస్ అయ్యారు సలార్ మేకర్స్. ఇప్పటికిప్పుడు ఆ గ్యాప్‌ని థియేటర్లలో ఫిల్ చేద్దామన్నా, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న బిగ్ మూవీస్‌కి టైమ్ సరిపోదు.
సలార్ ఒకవేళ డిసెంబర్‌కి పోస్ట్ పోన్ అయితే, గ్రౌండ్‌లో ఆడుదామనుకున్న మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి..? ఇలా... రకరకాల డిస్కషన్లు జరుగుతున్నాయి ఫిల్మ్ నగర్‌లో.