రాముడి పాత్రలో నటించే సమయంలో ఆల్కహాల్ తీసుకోకుండా మాసం తినకుండా ఉండాలని ఫిక్స్ అయ్యారట రణబీర్ కపూర్.
లుక్స్ పరంగానూ శ్రీరాముడిలా కనిపించేందుకు మేకోవర్ అవుతున్నారు. యానిమల్ తరువాత రణబీర్ చేయబోయే మూవీ రామాయణమే అన్న టాక్ కూడా వినిపిస్తోంది.
రణబీర్ విషయంలో అఫీషియల్ క్లారిటీ లేకపోయినా... సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి మాత్రం బాలీవుడ్ రామాయణం విషయంలో క్లారిటీ ఇచ్చారన్నది కోలీవుడ్ టాక్.
తాజాగా ఓ పార్టీలో పాల్గొన్న సాయి పల్లవి, సీత పాత్రకు తనను సెలెక్ట్ చేయటం అదృష్టంగా భావిస్తున్నా అని కామెంట్ చేశారట. ఆ కామెంటే సౌత్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.
సాయి పల్లవి కామెంట్‌తో రామాయణం ప్రాజెక్ట్ విషయంలో అఫీషియల్ క్లారిటీ ఇచ్చినా... ఇతర కాస్టింగ్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయాల్లో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.