TV9 Telugu

పెద్ద ఎన్టీఆర్ నుండి అల్లు అర్జున్ వరకు లేడీ గెటప్స్ మన స్టార్ హీరోలు.

04 April 2024

విశ్వ విఖ్యాత నటసౌర భౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు డ్రైవర్ రాముడు మూవీలో లేడీ గెటప్ లో కనిపించరు.

నటసింహ నందమూరి బాలకృష్ణ పాండురంగ సినిమాలో లేడి గెటప్ లో కనిపించి అప్పట్లో థియేటర్ దద్దరిల్లేలా చేసారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా చంటబ్బాయ్‌, పట్నం వచ్చిన పతివ్రతలు ఈ రెండు సినిమాలో లేడీ గెటప్ లో కనిపించి అలరించారు.

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కూడా పట్నం వచ్చిన పతివ్రతలు, వీర ప్రతాప్ సినిమాలో లేడీ గెటప్ వేసి ఆకట్టుకున్నారు.

టాలీవుడ్ లో మరో వర్సటైల్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సైతం మదం సినిమాలో లేడీ గెటప్ కనిపించి అలరించించారు.

తమిళ హీరో కమల్ హాసన్ కూడా భామనే సత్యభామనే సినిమాలో లేడి గెటప్ వేశారు. ఇది అప్పట్లో సూపర్ హిట్ సినిమా.

తమిళ నటుడు సూర్య కూడా వీడొక్కడే సినిమాలో లేడీ గెటప్ లో నటించాడు. దీనికి కెవి ఆనంద్ దర్శకతం వహించారు.

టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ కూడా పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో లేడి గెటప్ వేసి ఆకట్టుకున్నారు.

తమిళ స్టార్ హీరో కం యాక్టర్ విజయ్ సేతుపతి కూడా సూపర్ డీలక్స్ సినిమాలో లేడీ గెటప్‌లో నటించి మెప్పించాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన తొలి చిత్రం గంగోత్రిలో లేడి గెటప్ వేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది.