ఇండస్ట్రీలో డాటర్స్ ని నిలబెట్టడానికి స్టార్లు తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు.
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్... ఇండస్ట్రీ ఏదైనా సరే, మీతో మేం ఉన్నాం అంటూ ఆడబిడ్డలను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.
మన దగ్గర చిరంజీవి, పొరుగున రజనీకాంత్, నార్త్ లో షారుఖ్... తమ ఆడపడుచుల కోసం ఏం చేస్తున్నారో ఓ సారి చూసేద్దాం రండి.
చిరంజీవి తనయ సుష్మిత ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఓ వైపు డిజిటల్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ, మరోవైపు మూవీ ప్రొడక్షన్‌లోనూ బిజీ అవుతున్నారు.
త్వరలోనే చిరంజీవి హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు సుష్మిత. ఇప్పటికే చిరు మూవీస్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది సుష్మిత కొణిదెలకు.
వీరిద్దరిని చూసి నార్త్ లో షారుఖ్ కూడా ఇన్‌స్పయిర్ అయ్యారు. తనయ సుహానా కోసం కింగ్ అనే మూవీని మార్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
అంతే కాదు, ఆ సినిమాలో తాను కూడా కీ రోల్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది కింగ్.