TV9 Telugu
SSMB 29పై క్రేజీ న్యూస్ వైరల్.. గీతాంజలి వచ్చేది అప్పుడే..
02 March 2024
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌కు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్‌కు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, సాయి సతీష్ తదితరులు నటిస్తున్న చిత్రం భవాని యార్డ్ 1997. జీడీ నరసింహా ఈ సినిమాకు దర్శకుడు.
తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు. హార్రర్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు.. తమ సినిమా నచ్చుతుందని తెలిపారు మేకర్స్.
అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సునీల్ కీలక పాత్రల్లో శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం గీతాంజలి మళ్ళీ వచ్చింది.
హార్రర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కోన వెంకట్ కథా సహకారం అందిస్తున్నారు. 2014లో వచ్చిన గీతాంజలి చిత్రానికి ఇది కొనసాగింపు.
గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాను ఎప్రిల్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి