ఇలా అందంతో కవ్విస్తే ఎలా.. కుర్రాళ్ల మతులు పోగొట్టేలా..
28 September 2023
సౌత్ ఇండస్ట్రీలో శృతి హాసన్ గురించి తెలియని వారుండరు. హీరో కమల్ హాసన్ వారుసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ అందాల తార.
1992లో అంటే ఆరేళ్ల వయసులోనే తమిళంలో తేవర్ మగన్ చిత్రంతో ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ మొదలుపెట్టింది.
తర్వాత 2000లో తన తండ్రి కమల్ హాసన్ తెరకెక్కించిన హే రామ్ సినిమాలో బాలనటిగా అతిధి పాత్రలో ఆకట్టుకుంది.
తొమ్మిదేళ్ల తర్వాత 2009లో లక్ అనే బాలీవుడ్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
2010లో అనగనగ ఓ ధీరుడు అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయకిగా ఇండస్ట్రీ అరంగేట్రం చేసింది ఈ తమిళ బ్యూటీ.
దీని తర్వాత తెలుగులో ఓ మై ఫ్రెండ్ చిత్రంలో సిద్ధార్థ్ ఫ్రెండ్ గా ముఖ్య భూమిక పోషించింది శృతి. ఈ చిత్రం యూత్ ని ఆకట్టుకుంది.
తర్వాత ఎన్నో తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ ఏడాది మొదట్లోనే వీరసింహరెడ్డి, వాల్తేర్ వీరయ్య చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది.
ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం సలార్ లో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.