ఘనంగా కిస్మత్ ప్రీ రిలీజ్ వేడుక.. ఉత్సవం టీజర్ రిలీజ్..

TV9 Telugu

29 January 2024

నరేష్ అగస్త్య, అభినవ్ గోముటం, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న సినిమా కిస్మత్. శ్రీనాథ్ బాధినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది.

తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీనికి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు కూడా అద్భుతమైన స్పందన వస్తుంది.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భ్రమయుగం. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమా వస్తుంది.

ఫిబ్రవరి 15న ప్రపంచ వ్యాప్తంగా భ్రమయుగం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

గీతానంద్, నేహా సోలంకి దయానంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా గేమ్ ఆన్. మధుబాల, ఆదిత్య మీనన్ ఇందులో కీలక పాత్రలు చేసారు.

ఫిబ్ర‌వ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది గేమ్ ఆన్. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే సైకలాజికల్ థ్రిల్లర్‌గా గేమ్ ఆన్ సినిమా ఉండనుంది.

దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా జంటగా అర్జున్ సాయి తెరకెక్కిస్తున్న సినిమా ఉత్సవం. నాటక రంగం, కళాకారుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఈ చిత్రం రూపొందుతోంది.

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వగా.. త్వరలోనే విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా టీజర్ విడుదల చేశారు.