23 August 2025
సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్. అయినా ఈ బ్యూటీకి ఆఫర్స్ కరువు..
Rajitha Chanti
Pic credit - Instagram
కన్నడ సినీరంగంలో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. కథానాయికగా ఫస్ట్ మూవీతోనే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగు, కన్నడ, తమిళంలో ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ మాత్రం కరువయ్యాయి.
ఇప్పుడు ఈ అమ్మడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తను మరెవరో కాదండి.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి.
కేజీఎఫ్ సినిమాతో నటిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగింది.
ఆ తర్వాత తమిళంలో కోబ్రా చిత్రంలో నటించింది. ఇటీవలే తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన హిట్ 3 మూవీలో నటించి హిట్టు అందుకుంది.
కానీ ఆమె చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టైనా ఈ బ్యూటీకి మాత్రం ఆఫర్స్ కరువయ్యాయి. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.
సినిమాల్లోకి రాకముందు బెంగళూరులోని ఒక దిగ్గజ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసింది. అదే సమయంలో మోడలింగ్ చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస పోస్టులతో నెటిజన్లను కట్టిపడేస్తుంది. అలాగే సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్