స్టన్నింగ్ లుక్స్ తో కుర్రకారు మనసు దోచేస్తున్న శ్రీనిధి శెట్టి

TV9 Telugu

16 JULY 2024

శ్రీనిధి శెట్టి ఈ ముద్దగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మోడల్ గా కెరీర్ ప్రారంభించి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.

మొదటి సినిమా కన్నడ హీరో యష్ సరసన హీరోయిన్ గ K.G.F సినిమాలో నటించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గ నిలిచింది

కేజీఎఫ్ సినిమాల తర్వాత చియాన్ విక్రమ్ తో కోబ్రా మూవీలో మెరిసింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు.

శ్రీనిధి ప్రస్తుతం తెలుగులో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న “తెలుసు కదా” సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఐతే ఈ సినిమాలో శ్రీనిధితో పాటు రాశి ఖన్నా కూడా నటిస్తుంది.

ఇక లేటెస్ట్ గా అమ్మడు న్యాచురల్ స్టార్ నాని చేస్తున్న హిట్ 3 లో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఇప్పుడు హిట్ 3 ని నాని చేస్తున్నాడు. 

 హిట్ 3 తో శ్రీనిధి హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ సినిమా హిట్  అయితే అమ్మడుకి తెలుగులో మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ  షేర్ చేసిన తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.