నన్ను అందరూ 'లేడీ ప్రభాస్' అని పిలుస్తారు: టాలీవుడ్ హీరోయిన్
04 October 2025
Basha Shek
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెలబ్రిటీలు కూడా డార్లింగ్ ను అభిమానిస్తారు
ఈ నేపథ్యంలో టాలీవుడ్ కు చెందిన ఒక క్రేజీ హీరోయిన్ తనను ప్రభాస్ తో పోల్చుకుంటోంది. ఏకంగా లేడీ ప్రభాస్ అని కాంప్లిమెంట్ ఇచ్చుకుంటోంది.
ఇంతకీ ఈ పోలిక ఎందుకు వచ్చిందంటే ప్రభాస్ లాగే ఈ క్రేజీ హీరోయిన్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించదట.
'నేను ప్రభాస్‌లా సోషల్ మీడియాలో ఎక్కువ ఉపయోగించను. అందుకే నా స్నేహితులందరూ నన్ను లేడీ ప్రభాస్ అని పిలుస్తుంటారు' అంటోందీ అందాల తార.
కేజీఎఫ్' సినిమాతో హీరోయిన్‌గా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటిస్తోంది.
ఆ మధ్యన నాని 'హిట్ 3'తో సక్సెస్ అందుకున్న శ్రీనిధి శెట్టి ఇప్పుడు 'తెలుసు కదా' అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్టోబరు 17న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ తనని ఫ్రెండ్స్ అందరూ లేడీ ప్రభాస్ అని పిలుస్తారని శ్రీనిధి చెప్పింది.
శ్రీనిధి శెట్టి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రభాస్ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..