'డిప్రెషన్‌తో తాగుడుకు బానియ్యా..' ఏడిపిస్తున్న శ్రీహరి భార్య మాటలు..
04 September 2023
స్పెషల్ సాంగ్స్ క్వీణ్ గా టాలీవుడ్లో పాపులర్ అయిన డిస్కో శాంతి! ఆ తర్వాత శ్రీహరి భార్యగా పాపులర్ అయ్యారు.
తన భర్తకు వెన్నంటి ఉంటూ ఆయన కెరీర్లో దూసుకుపోయేలా ఇండస్ట్రీలో శ్రీహరి వెలుగు వెలిగిన టైంలో టాలీవుడ్లో అందరి చేత గౌరవ మర్యాదలు వచ్చేలా చేసుకున్నారు.
టాలీవుడ్‌లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ప్రొడ్యూసర్‌గా శ్రీహరి దూసుకుపోతున్న టైంలోనే ఆయన కాలేయ సంబంధిత వ్యాధిగా గురయ్యారు. ఆ కారణంగానే వీక్ అవుతూ వచ్చారు.
ఇక ఆక్రమంలోనే ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో తీవ్ర అస్వస్థతకు గురై బాంబే హాస్పటిల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు శ్రీహరి.
ఆయన మరణానికి సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్న ఆయన భార్య డిస్కోశాంతి. తన భర్త మరణంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యా అంటూ ఎమోషనల్ అయ్యారు.
అంతేకాదు డిప్రెషన్ కారణంగా మధ్యానికి బానిసయ్యానని.. మూడు నెలలు ఆ భాదతోనే కుంగిపోయా అంటూ చెప్పి అందర్నీ షాకయ్యేలా చేశారు డిస్కో శాంతి.
అంతేకాదు డిప్రెషన్ కారణంగా మధ్యానికి బానిసయ్యానని.. మూడు నెలలు ఆ భాదతోనే కుంగిపోయా అంటూ చెప్పి అందర్నీ షాకయ్యేలా చేశారు డిస్కో శాంతి.
చిన్న వయసులో మరణించిన నటుల్లో శ్రీహరి ఒకరు. అయన చేసిన చిత్రలు, పాత్రలు ఎప్పటికి మరిచిపోలేనివి అనే చెప్పాలి.