ఆకట్టుకుంటున్న ‘శ్రీరంగనీతులు’ ఫస్ట్ లుక్..

సుహాస్‌, కార్తీక్‌రత్నం, రుహానీ శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘శ్రీరంగనీతులు’.

ప్రవీణ్‌కుమార్‌ వీఎస్‌ఎస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

గురువారం ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.

ఈ చిత్రంలో విరాజ్‌ అశ్విన్‌, తనికెళ్ల భరణి, గీత భాస్కర్‌, శ్రీనివాస్‌ అవసరాల తదితరులు నటింస్తున్నారు.

ఈ చిత్రానికి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, అజయ్‌ అర్సాడ సంగీతం అందిస్తున్నారు.