ప్రేమ పేరుతో మోసం.. 6 ఏళ్లు వృధా.. శ్రీముఖి వీడియో వైరల్

26 August 2025

Phani Ch

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా కనపడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో అడపాదడపా వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది.

నటి కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగు పెట్టారు. హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. అది అంత ఈజీ కాదని తెలుసుకుని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది.

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా శ్రీముఖి తన సత్తా చాటి రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే మాటలు కూడా వినిపించాయి.

ఇక తాజాగా శ్రీముఖికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తితో శ్రీముఖి మాట్లాడుతూ కనిపించింది..”నువ్వే నాకు ప్రపోజ్ చేసావ్..ఆ తర్వాత మాత్రం ప్రేమ కాదు నా కెరియర్ ముఖ్యమని వెళ్లిపోయావు

ఇప్పుడు ఛాన్స్ ఇమ్మంటే ఎలా ఇస్తాను. నాకు ఆరేళ్లు వృధా అయిపోయింది..” అంటూ ఒక అబ్బాయితో మాట్లాడుతూ కనిపించింది శ్రీముఖి.

ఆ అబ్బాయి మాత్రం శ్రీముఖిని కన్విన్స్ చేయడానికి ఎన్నో చెబుతూ కనిపించారు. ఈ క్రమంలో ఇతనేనా శ్రీముఖి లవర్ అని అందరూ సోషల్ మీడియాలో కామెంట్స్ లో పెడుతున్నారు.

అయితే అసలు విషయానికి వస్తే ఇది కేవలం బిగ్బాస్ అగ్ని పరీక్షలో.. కేవలం ఒక చిన్న స్కిట్ మాత్రమే. ఇక ఈ స్కిట్ చూసి ఇదంతా నిజం అనుకుంటున్నాడు ఎంతోమంది.