హాఫ్ సారీలో ఆకట్టుకుంటున్న బుల్లితెర రాములమ్మ..
24 October 2023
1993 మే 10న ఆంధ్రప్రదేశ్ (ఇప్పటి తెలంగాణ)లోని నిజామాబాద్‌లో జన్మించింది శ్రీముఖి. ఆమె డెంటిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది.
2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో జులాయి సినిమాలో అల్లు అర్జున్ సోదరి రాజి పాత్రలో తొలిసారి వెండితెరపై కనిపించింది ఈ బ్యూటీ.
తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రంలో సోనియా అనే పాత్రలో నటించింది వయ్యారి భామ.
సినిమాల్లో నటిస్తూనే 2013లో అదుర్స్ అనే టీవీ షోతో టెలివిజన్ ప్రేక్షకులకు యాంకర్ గా పరిచయం అయింది ఈ బ్యూటీ.
ఎన్నో టెలివిజన్ రియాలిటీ షోలకి యాంకర్ గా తన మాటలు, చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బుల్లితెర రాములమ్మ.
2015లో యాంకర్ రవితో కలిసి చేసిన స్టాండ్ అప్ కామెడీ షో పటాస్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ.
స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్, బొమ్మ అదిరింది, డాన్స్ ఐకాన్, మిస్టర్ అండ్ మిస్సెస్, సారంగ దరియా వంటి షోలకు యాంకర్ గా చేస్తుంది.
టీవీ షోలు చేస్తూనే మరో వైపు సినిమాలు చేస్తుంది. ఇటీవల చిరు హీరోగా నటించిన భోళా శంకర్ చిత్రంలో నటించింది ఈ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి